రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు.
హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలన్న టీడీపీ అధిష్ఠానం ప్రతిపాదనను దాదాపుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. ఆయన తన అయిష్టాన్ని ఇప్పటికే ప్రదర్శిస్తూ అధిష్ఠానం ముందు తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలిసింది.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ చేరారు. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.
టీడీపీలో కొత్త ట్రబుల్ షూటర్స్ దిగారా? చంద్రబాబు వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా? పార్టీకి సంక్లిష్టంగా ఉండే నియోజకవర్గాలనే కొత్త నేతలకు టార్గెట్గా పెట్టారా? తన రెగ్యులర్ స్టైల్కు భిన్నంగా…. ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్లేదు, రిజల్ట్ ముఖ్యం అంటూ చంద్రబాబు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్స్? ఏంటా స్టోరీ? చంద్రబాబు సొంత జిల్లా అయినా…ఉమ్మడి చిత్తూరు టీడీపీకి ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక, అసమ్మతిని నియంత్రించడం కత్తిమీద సాములాగే…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు కన్నెర్ర జేస్తే వైసీపీ గల్లంతవుతుందన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి. గన్నవరంలోని ఏబీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి తెలుగు మహిళా సమావేశంలో వెంకట్రావుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.