టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు కలిశారు. టీడీపీకి సంబంధించి టిక్కెట్ల ప్రకటన అనంతరం నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచిస్తున్నారు. సీటు రాలేదు అంటే.. పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చెబుతున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధినేత నేతలకు వివరించారు. ఈ క్రమంలో.. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల…
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో…
స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఏడాది క్రితమే తమను వైసీపీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేసే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారో.. ఆ రోజు ఈ చర్య తీసుకుని ఉంటే ప్రజలు హర్షించేవారని చెప్పారు. ఈ చర్యలతో వాళ్లు సాధించిందేమీ లేదని.. తమకు వచ్చిన నష్టం కూడా…
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసరావుపేటలో జరిగే రా కదలి రా సభలో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మార్చి1న చలో మేడిగడ్డ.. తెలంగాణ భవన్ నుంచి 150 మంది బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మార్చి 1న తలపెట్టిన ప్రాజెక్టుల సందర్శనకు తమ వెంట కాంగ్రెస్ మంత్రులను తీసుకెళ్తామని.. కాళేశ్వరం ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం కలిసి వెళతామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ నుంచి 150 మంది…
విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది.…