మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టోను వెబ్ సైట్ నుండి తొలగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సహాయం అందించింది. నారా చంద్రబాబు నాయుడు 2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టోను వెబ్ సైట్ నుండి తొలగించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా?. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా?. ఎన్నికల సమయం రాగానే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు.