తనతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే…
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి.. విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో 5 మంది యూనిట్ ఇన్చార్జీలు 47మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు…
ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఐకమత్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా వేగర వేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు మారుతాయి అన్నారు.