Gautam Gambhir controversy: గంభీర్ రాజకీయాలతో టీమిండియాను నాశనం చేశాడు.. మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir controversy: టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు పాక్ మాజీ క్రికెటర్.. గంభీర్ రాజకీయాలను జట్టు వాతావరణంలోకి తీసుకొచ్చి టీమ్ ఇండియాను దెబ్బతీశాడు’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు కోచ్‌గా ఉన్న గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్‌లో తీసుకున్న జట్టు ఎంపిక నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే..
కీలక మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయాన్ని అశ్విన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే కాగా.. 2019–2024 మధ్య తూర్పు ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన గంభీర్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ షెహజాద్ విమర్శలు గుప్పించారు. ఏ రంగంలోనైనా పూర్తి దృష్టి అవసరం. గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అతని ఆలోచనా విధానం మారిందని అనిపిస్తోంది. ఇప్పుడు అదే రాజకీయ ధోరణి జట్టు వాతావరణంలో కనిపిస్తోంది. ఇది భారత జట్టు ప్రతిష్టకు హానికరం అని షెహజాద్ వ్యాఖ్యానించాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక, జట్టు వద్ద ఉన్న ప్రతిభను సరైన విధంగా ఉపయోగించుకోవడంలో కోచ్ విఫలమయ్యాడని షెహజాద్ ఆరోపించాడు. ముఖ్యంగా కుల్‌దీప్ యాదవ్‌కు పరిమిత అవకాశాలు ఇవ్వడం పై ప్రశ్నలు లేవనెత్తాడు. “మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం లేదు. జట్టు వనరులను సమర్థంగా నిర్వహించడం జరగడం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. కొంతకాలంగా జట్టులో అంతర్గత విభేదాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక సందర్భంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే వారు ఆ వార్తలను ఖండిస్తూ వీడియో విడుదల చేసినప్పటికీ, ఆ అంశంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇక గంభీర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌లు కోల్పోలేదని చెప్పినా, వరుస కీలక మ్యాచ్‌ల నేపథ్యంలో ఒత్తిడి మాత్రం పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు తన తదుపరి సూపర్ 8 మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితం జట్టు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!