US-Iran Tension: ఇరాన్ వార్‌కు ముందు, యూఎస్ సైన్యానికి ‘‘టాయిలెట్’’ సమస్య..
- ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న అమెరికా..
- మరోవైపు అమెరిన్ సైన్యాన్ని వేధిస్తున్న ‘‘టాయిలెట్’’ సమస్య..
- USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్‌లో వేధిస్తున్న టాయిలెట్ల కొరత..
- 45 నిమిషాల పాటు క్యూలో వేచి ఉంటున్న సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Tension: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ క్షణానైనా ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా అమెరికన్ సైన్యం ఉంది. ఇరాన్ సమీపంలో అరేబియా సముద్రంలో యూఎస్ విమానవాహక నౌక USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ తిష్ట వేసి ఉంది. ఇదే కాకుండా ఇరాన్ చుట్టు పక్కల అమెరికన్ బేసులు యాక్టివేట్ అయ్యాయి. భారీ సంఖ్యలో యూఎస్ ఫైటర్ జెట్లు మిడిల్ ఈస్ట్‌లో మోహరించారు.
ఇదిలా ఉంటే, అసలు యుద్ధానికి ముందే అమెరికన్ సైనికులను ‘‘టాయిలెట్ వార్’’ భయపెడుతోంది. ఇరాన్ వైపు కదులుతున్న USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధ నౌకలో టాయిలెట్లు మూసుకుపోయాయి. దీని వల్ల నౌకలో ఉన్న సైనికులు జీవితం దుర్భరంగా మారింది. 4500 మంది సైనికులు ప్రతీ రోజూ 45 నిమిషాల పాటు క్యూ లైన్లలో నిలుచోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నౌకలోని మురుగునీటి వ్యవస్థ విఫలమైంది. USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ జూన్ 2025 నుండి సముద్రంలో ఉంది. జనవరిలో, వెనిజులాపై అమెరికా దాడిలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది, దీని ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి మోహరించారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
Read Also: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
టాయిలెట్లు పనిచేయకపోవడం, ఓడలోని మురుగునీటి వ్యవస్థ పనిచేయకపోవడంతో పరిస్థితి దిగజారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌకగా పరిగణించే ఈ యుద్ధ నౌకలో సౌకర్యాలు లేక సైనికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నౌకలో మొత్తం 650 టాయిలెట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పనిచేయడం లేదు. సముద్రంలో నిరంతరం ఉండటంతో సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ప్లంబింగ్, నావికుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. వ్యవస్థల్ని సరిచేయడానికి నిపుణులు రోజుకు 19 గంటలు పనిచేస్తున్నాయి. ఈ సమస్య గతేడాది మార్చిలో కూడా వచ్చింది. ఆ సమయంలో నాలుగు రోజుల పాటు 205 టాయిలెట్లు పనిచేయలేదు.
సాధారణంగా యుద్ధనౌకలో వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థ ఉంటుంది. ఒకే వాల్వ్ ఫెయిల్యూర్ మొత్తం కంపార్ట్‌మెంట్ లోని అన్ని టాయిలెట్లను దెబ్బతీస్తుంది. దీనికి తోడు కాల్షియం పేరుకుపోవడం వల్ల పైపులు మూసుకుపోతుంటాయి. ఈ వ్యవస్థల్ని సరిచేయడానికి ప్రతీసారి యాసిడ్ ఫ్లషింగ్ కోసం 4 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!