తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు
అవినీతి పాలనను అంతమొందించి సుపరిపాలన కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజా గళం సభను విజయవంతం చేయాలని ఉదయగిరి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నెల 29న వింజమూరులో నిర్వహించనున్న ప్రజాగళం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు.' అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలిలోని పూలే కాలనీలో శిథిలావస్థకు చేరిన టిడ్కో ఇళ్లను నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. నిన్న బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజు పేరును ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలి.. ఎన్నికల సమయంలో పని చేసే విషయాలపై క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి దిశా నిర్దేశం చేయాలన్నారు.