శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నల్లమడ మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన ఓటీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని కొందరు దుండగులు విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గొడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య…
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరి మండల కేంద్రంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకర్ల సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.…
ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని పలు పెళ్లి వేడుకల్లో ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం జమ్మల పాలెంలో ఉన్నటువంటి ఎస్విఆర్ కళ్యాణ మండపంలో కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బొల్లా హనుమంతరావు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చరణ్, వినీల వివాహ మహోత్సవంలో కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది.. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇపుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నపుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించానన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నపుడు కూడా చెప్పానని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికే ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేలా చేస్తామని అన్నారు. పింఛన్ ను నాలుగు వేలు పెంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4…
రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా.. పుట్టను అడిగినా సైకిల్ మాటే వినపడుతోందని.. కూటమి గెలుపు మాటే వినపడుతోందని చంద్రబాబు చెప్పుకుచ్చారు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
ఈసీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం…