Kethireddy Pedda Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. అన్ని పార్టీలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.. కొందరు టికెట్లు దక్కకపోవడంతో.. తమ అనుచరులతో కలిసి.. మరో పార్టీ కండువా కప్పుకుంటుంటే.. మరికొందరు.. ప్రలోభాలకు లొంగి పార్టీలు మాతరుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అయితే, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డబ్బులతో ఎవరూ కొనలేరు అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నుండి వెళ్లేవారు కేవలం వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారని మండిపడ్డారు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు తెరలపాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సంతలో పశువులు కొన్నట్టు మా పార్టీ నాయకులను బెదిరించి ఐదు, పది లక్షలకు కొంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నుంచి వెళ్లిపోయేవారు వారంతా.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే అని పేర్కొన్నారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద నుంచి వచ్చిన స్క్రాపే మళ్లీ తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు.. అయితే, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చేసి ప్రభాకర్ రెడ్డి డబ్బులతో కొనలేడని హెచ్చరించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..
Read Also: Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..