Yarlagadda Venkat Rao Starts Election Campaign in Gannavaram: గన్నవరం నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రామాలయంలో వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం యార్లగడ్డ తన ప్రచారం ఆరంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని యార్లగడ్డ హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న యార్లగడ్డ వెంకట్రావు.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యార్లగడ్డ మాట్లాడుతూ… ‘గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవటంతో పాటు అవినీతి, పక్షపాతం పెరిగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విచ్చలవిడిగా అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో దోచుకు తిన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు అధికమయ్యాయి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై లెక్కలేనని దాడులు చేసి.. ఎదురు బాధితుల పైనే కేసులు నమోదు చేశారు. ఈ దుస్థితిలో మార్పు వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
Also Read: Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య!
తనకు ఓ అవకాశం ఇస్తే.. గన్నవరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మారుపూడి సాంబశివరావు, ఆరెపల్లి రమేష్, మీసాల రామూర్తి, మాదాల నాని బాబు, యోగిశెట్టి రత్నాకరావు, నల్లమోతు వందనం, పమిడిముక్కల దావీదు, గుంటుపల్లి హర్ష, అంకం సాయి, అంకం వాసు, అంకం ఫణింద్ర, కోయ దుర్గాప్రసాద్, సెగ సతీష్, జనసేన నాయకులు పొదిలి దుర్గారావు మరియు బీజేపీ నాయకులు డాక్టర్ ఫణికుమార్, మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.