Kesineni Nani on Chandrababu Naidu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి పేదలంటే చులకన అని విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. ‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’ అన్నది చంద్రబాబు స్కీమ్ అని ఎద్దేవా చేశారు. తన కోసం, తన కొడుకు కోసం, తన పవర్ కోసం, కేసుల నుండి బయటపడడం కోసం ప్రధాని మోడీ కాళ్లు బాబు పట్టుకున్నాడని కేశినేని నాని ఫైర్ అయ్యారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేశినేని నాని మాట్లాడుతూ… ‘చంద్రబాబుకి పేదలంటే చులకన. క్యాష్ కొట్టు టికెట్ పట్టు అన్నది చంద్రబాబు స్కీమ్. రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా?. బీజేపీ-జనసేన-టీడీపీ పార్టీలు అధికారంలోకి రావడానికి 600 హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు పరచరు. చంద్రబాబు నా చేత పార్లమెంటులో ప్రధాని మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. ఇప్పుడు అదే బాబు మళ్లీ మోడీతో కలిశాడు. పేదలకు ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.
Also Read: Yarlagadda Venkat Rao: పూజలు నిర్వహించి.. ఎన్నికల ప్రచారం మొదలెట్టిన యార్లగడ్డ వెంకట్రావు!
‘నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పవర్ కోసం, నీ కేసుల నుండి బయటపడడం కోసం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకున్నావు. అందరూ గో బ్యాక్ బాబు అంటున్నారు. నిన్ను తెలంగాణ పంపించడానికి ఆంధ్ర ప్రజలు రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీసీ అయినా పోతిన మహేష్‌ని మోసం చేసి.. ఒక ధనికుడు సృజన చౌదరికి తెలుగుదేశంతో కలిసి సీట్ అమ్ముకున్నాడు. పోతిన మహేష్‌ని అప్పుల పాలు చేసి నట్టేట ముంచేసిన పవన్‌ని ఎవరు నమ్ముతారు. జాబు రావాలంటే బాబు రావడం కాదు.. ధనికులు బాగుండాలంటే బాబు రావాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంని రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయావు.. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని కేశినేని నాని ఫైర్ అయ్యారు.