Perni Nani: చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక లాడ్జిలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో చర్చలు జరిపిన నికార్సైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ అని విమర్శించారు. రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అంటూ విమర్శించారు. ఈ సంస్థ తరపున కోర్టుల్లో లక్షల రూపాయల ఫీజులు తీసుకునే లాయర్ కపిల్ సిబల్ వాదిస్తారన్నారు. నిమ్మగడ్డ రమేష్ ,భవాని ప్రసాద్‌లు ఎలక్షన్ వాచ్ కాదు.. పసుపు వాచ్ అంటూ ఆరోపణలు చేశారు.
Read Also: Seediri Appalaraju: వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పని చేయడం నేరమా..?
గడిచిన ఆరు మాసాలుగా ఎలక్షన్ సిబ్బంది లక్ష్యంగా సిటిజన్ ఫర్ డెమోక్రసి బ్లాక్ మెయిల్ చేస్తోందని పేర్ని నాని అన్నారు. నారా చంద్రబాబు బార్య భువనేశ్వరి కోడ్‌ను బ్రేక్ చేస్తోందని, మూడు లక్షల చెక్ పంపిణీ చేస్తుందని.. భువనేశ్వరిపై మేము పిటిషన్ ఇస్తే ఆమెకు ఇప్పటి వరకు ఈసీ నోటీసులు పంపలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను ఎవరు నడుపుతున్నారు ? ఎవర్రు ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్వో పై ఒత్తిడి చేస్తున్నారా ? ఎందుకీ వైసీపీపై పక్షపాత ధోరణి అంటూ ప్రశ్నించారు. ఈసీకి ఫిర్యాదు చేసినా నారా భువనేశ్వరి యాత్రను ఎందుకు ఆపడం లేదన్నారు. వాలంటీర్ల మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి విషం చిమ్మారన్నారు.
Read Also: Chandrababu: ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం..
పెన్షన్ తీసుకునేందుకు ఇప్పుడు రెండు మూడు రోజులు ఇప్పుడు పడిగాపులు కాయాలన్నారు. జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పెత్తందారీల వైపు ఉన్నారన్నారు. మూడు నెలలు పెన్షన్‌ల కోసం పేదలు ఇప్పుడు పడిగాపులు కాయాలన్నారు. ఈ పెత్తందారీ మనస్తత్వాన్ని ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీకి వాత పెట్టాలన్నారు. పవన్ కల్యాణ్ మాటలు క్రమంగా మొద్దుబారుతున్నాయన్నారు. 2019లో పవన్ భీమవరంలో కూడా గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, ఇల్లు కట్టుకుంటానని అన్నారని పేర్ని నాని తెలిపారు. మళ్లీ ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మీద వ్యతిరేకత ఉన్నదని పవన్ అనుకుంటే భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని మాత్రమే కోరుకుంటున్నారన్నారు. పిఠాపురంలో ప్రైవేటు హాస్పిటల్ కట్టిస్తా అని పవన్ అంటున్నారని.. అంటే మూడు పార్టీలు కలిసినా అధికారంలోకి రాదని పవన్ డిసైడ్ అయ్యారా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని జనం పరుగులు తీస్తున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.