టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. గరం మసాలా లాగ చంద్రబాబు మాటలు ఉన్నాయని విమర్శించారు. బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదని, తన పుట్టినరోజుకి మాత్రం 70 వేల మంది వచ్చారన్నారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం తమ సాంప్రదాయం అని, పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం అని ఫైర్ అయ్యారు. తానే మళ్లీ ఎమ్మేల్యేగా గెలుస్తానని, మంత్రి పదవితో వవస్తానని మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
‘బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదు కానీ నా పుట్టినరోజుకి 70 వేల మంది వచ్చారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం మా సాంప్రదాయం అయితే పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం. వీరప్పన్, పుష్ప అంటే కాళహస్తీ ప్రజలకు బొజ్జల సుధీర్ రెడ్డి గుర్తుకు వస్తాడు. బోజ్జలకు మంత్రి పదవి పోవడానికి, చనిపోవడానికి కారణం సుధీర్ రెడ్డి కాదా?. పుష్ప సినిమా బోజ్జలను చూసే తీశారు. సమాధులు కుడా తవ్వి ఇసుకను కుడా అమ్ముకున్న చరిత్ర బొజ్జల సుధీర్ రెడ్డిది’ అని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు.
Also Read: Prabhakar Chowdary: కార్యకర్తలు ఓకే అంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: ప్రభాకర్ చౌదరి
‘నాకు కళ్లు సరిగా పనిచేయవు, ఆపరేషన్ చేసుకోవాలని బెయిల్ పై బయటకు వచ్చావు. నువ్వు సేఫ్ డ్రైవర్ అని చెప్పుకొంటూ నా బస్సు ఎక్కండి అని అడుగుతున్నావా?. నిన్ను నమ్ముకొని ఎవ్వరూ బస్సు ఎక్కరు. నేనే మళ్లీ ఎమ్మేల్యే గా గెలుస్తా.. మంత్రి పదవితో వస్తా. నా బ్లడ్, సుదీర్ రెడ్డి బ్లడ్ పరీక్షించండి.. ఎవరు డ్రగ్స్, గంజాయి వాడుతారో మీకే తెలుస్తుంది. శివుని మీద ప్రమాణం చేసి చెప్పు.. ఎమ్మెల్యేగా గెలిస్తే కాళహస్తిలోనే ఉంటావని. నేనూ గెలిచినా, ఓడినా కాళహస్తి లోనే వుంటా’ అని మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు.