టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసులో బుధవారం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సమీక్ష నిర్వహించారు.