విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు.
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే నినాదంతో పని చేయాలి.. తెలుగు జాతికి పూర్వ వైభవం వచ్చేలా ఉగాది రోజున ప్రజలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు.
కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
జనసేన పార్టీకి షాక్ ఇస్తూ.. రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న పోతిన మహేష్.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో జనసేన, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు.. సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం.. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు.