Pemmasani Chandrashekar: ‘విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టిడిపి కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎవరికీ దక్కదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. గుంటూరులోని స్థానిక టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ఏయే డివిజన్లలో ఏ కార్యకర్త, ఏ స్థాయిలో కష్టపడ్డారు అన్నది తాను స్వయంగా తెలుసుకుంటానని, పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా పిడుగురాళ్ల మాధవికి మెజారిటీ వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాల్లో, అధికారులతో, ఇతరత్రా సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే స్థానికంగా డివిజన్లో ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పెమ్మసాని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని), కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Also: Yarlagadda Venkat Rao: గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలబెడుతా..
ఇఫ్తార్ విందులో పెమ్మసాని..
గుంటూరులోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ముస్లిమ్ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ , తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్‌లు కలిసి పాల్గొన్నారు. ముందుగా ముస్లిమ్ సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులందరికి పెమ్మసాని చంద్రశేఖర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల ఆకలి బాధలు అందరికీ తెలియ చేసే విధంగా రంజాన్ సంప్రదాయం ప్రవక్త ఆదేశాలతో ఏర్పడిందన్నారు. ఓపిక సహనం పెంచేదే రంజాన్ పండుగ గొప్పతనమేనన్నారు. ఈ ఎన్నికల చలవకొద్ది వీలైనంత ఎక్కువమంది ముస్లింలను కలుస్తూ ఉండటం చాలా సంతోషకరమన్నారు. మీ అందరితో కలిసి భోజనం చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు.