El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!
- డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య
- అంతమొందించిన మెక్సికో దళాలు
- ఎలా దొరికాడో వెల్లడించిన రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది. ఎల్ మెన్చో అనుచరులు రణరంగం సృష్టించారు. ఆస్తుల ధ్వంసంతో పాటు వాహనాలు తగలబెట్టారు. దాదాపు 20 రాష్ట్రాల్లో బీభత్సం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అసలు ఎల్ మెన్చో ఎలా పట్టుబడ్డాడు. ఎలా దొరికాడో వివరాలను మెక్సికన్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఎల్ మెన్చోను కలిసేందుకు శనివారం ప్రియురాలు టప్పాల్పా అనే గ్రామంలోకి వచ్చింది. అయితే ఆమెపై ఎప్పటి నుంచో అమెరికా నిఘా పెట్టడంతో వెంటనే మెక్సికో దళాలకు సమాచారం అందించింది. వెంటనే దళాలు ముట్టడి వేశాయి. ఇంతలో అలర్టైన ఎల్ మెన్చో దాకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడి అనుచరులు ఎదురుకాల్పులకు దిగారు. భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కోవడంతో ఎల్ మెన్చో గాయాలు పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే చనిపోయాడు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇది కూడా చదవండి: UP: రక్తసంబంధానికి మాయని మచ్చ.. హత్య వెనుక అమానుషం.. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ
మెక్సికన్ రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా వివరాల ప్రకారం.. ఎల్ మెన్చోకు అనేక మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. అందులో ఒకామెను ఎల్ మెన్చోకు అత్యంత విశ్వాపాత్రుడు తప్పాల్పాలోని ఒక ఇంటికి తీసుకొచ్చాడని తెలిపారు. శనివారం ఎల్ మెన్చోను కలిసి ఆమె వెళ్లిపోయిందని చెప్పారు. అనంతరం భద్రతా సిబ్బందితో కలిసి ఎల్ మెన్చో ఇంటిలోనే ఉన్నాడని.. వెంటనే సైన్యం అప్రమత్తం అయినట్లు వెల్లడించారు. వెంటనే సైనికులు రహస్యంగా ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఎల్ మెన్చో దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని.. 2015లో కూడా ఒక సైనిక హెలికాప్టర్‌ను కూల్చేసి తప్పించుకున్నాడని చెప్పారు. ఈ సమయంలో కూడా ఎదురుదాడికి దిగాడని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mohammad Kaif: ధోనీ–రోహిత్ vs సూర్యకుమార్.. సూర్య కెప్టెన్సీ లోపాలను ఎత్తి చూసిన మాజీ క్రికెటర్..
ఈ క్రమంలో ఎల్ మెన్చో అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నాడని.. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పొదల్లో కొనుగొన్నట్లు వివరించారు. అతడి అనుచరులు వెంటనే సైనిక హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని.. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎదురుకాల్పుల్లో ఎల్ మెన్చో.. అతడి భద్రతా సిబ్బంది ఇద్దరూ గాయపడ్డారని పేర్కొన్నారు. ముగ్గురినీ హెలికాప్టర్ ద్వారా గ్వాడలజారాలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను మెక్సికో నగరానికి విమానంలో పంపించి జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అప్పగించారు. ఎల్ మెన్చో మృతదేహాన్ని అతని కుటుంబానికి అందజేస్తామని భద్రతా మంత్రి ఒమర్ గార్సియా హర్ఫుచ్ తెలిపారు. ఖననం ఎక్కడ జరుగుతుందో ఇంకా నిర్ణయించలేదన్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!