ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్‌కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు.…
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆ బిల్లు వచ్చినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, DBT పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదును లబ్దిదారులకు…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు..
నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్‌లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని..…