పీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ సైతం ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు, కీలక నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..…
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని…
డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడారు.
రాయలసీమలో మూడు సీట్లు వచ్చినందుకు ఎగతాళి చేశారని.. పులివెందులలో కూడా ఇపుడు వైసీపీ కి జగన్ కు ఎదురుగాలి వేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో భూహక్కు పత్రాన్ని తగల బెట్టారు.
ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలోని సుమారు 20 గ్రామాల నుంచి 500కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో పెదకూరపాడు, హుస్సేన్ నగర్, బెల్లంకొండ, వెంకటాయపాలెం, అమరావతి, మునగోడు, అచ్చంపేట, వేల్పూరు, కస్తల మండలాలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరారు.