Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ ఘటనపై మంత్రి సత్యకుమార్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు… ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. దీంతో, వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశాం అన్నారు సత్యకుమార్.. ఇక, మరణించిన వాళ్లు 58 ఏళ్ల పై బడ్డ పెద్దవాళ్లుగా గుర్తించాం అన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారన్నారు.. సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు సత్యకుమార్. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నాం అన్నారు.. మరోవైపు, నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న లాబ్స్ కు పంపామని.. పశువులకు ఇచ్చే మేత నాణ్యత పైనా నమూనాలను పరీక్షలకు పంపాం అన్నారు సత్యకుమార్ యాదవ్.. ఇక, ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
Read Also: Adulterated Ghee: రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ..
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
కాగా, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తాజాగా మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపోయారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే, రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్‌లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!