ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వరుస రివ్యూలు చేపడుతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 నుంచి ఇవాళ్టి వరకు పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వరుస రివ్యూలు చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏపీలో అనేక చోట్ల నెలకొన్నాయి. Also read: MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి…
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. Also…
గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసింది అని ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారు.. ఎన్నికల సమయంలో.కొందరు పోలీస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు.. చంద్రగిరి నియోజకవర్గ ల్ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనం అన్నారు.
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు. Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? జెసి ప్రభాకర్ రెడ్డి,…
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.
ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు.
మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.