Nara Lokesh Responds on YS Jagan Arrest: సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. మంత్రి లోకేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చట్టం తన పని…
ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని…
BTech Ravi Counter to Satish Reddy: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. ‘చావు దగ్గరకు వస్తే ఒక చేయి మీసం మెలేస్తా’ అనే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు? అని విమర్శించారు. ధైర్యవంతుడు, పెద్ద డైలాగ్స్ కొట్టే సతీష్ రెడ్డి వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నావు? అని ప్రశ్నించారు. వేల్పుల కాల్పుల ఘటనలో గన్‌మెన్ ఫైర్ చేశారా, లేక నువ్వే గన్…
తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
Gudivada Tension: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నాగవారప్పాడు జంక్షన్ నుంచి K కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి పేర్నినాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దాంతో సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, 8 మంది టీడీపీ కార్పోరేటర్లు, అధికారులు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వేచి ఉన్నారు. మరోవైపు మేయర్ చాంబర్లో వైసీపీకి చెందిన 39 మంది కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశలో సందిగ్దత నెలకొంది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే…
నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం జరిగే ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే.. బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఆరు నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే.. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్య అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం…
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ - వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని..
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు.