TDP vs YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. గతంలో.. అక్కడ వైసీపీ పై చేయి అన్నట్టుగా పరిస్థితి ఉంటే.. కూటమి సరార్క్‌లో టీడీపీదే పైచేయి అయిపోయింది.. అంటే మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిదే అంటున్నారు.. ఇక, ఇప్పుడు తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
Read Also: Tragic : యాదాద్రిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
తాడిపత్రిలో రేపు పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీడీపీ – వైసీపీ.. రీకాలింగ్ చంద్రబాబు పేరుతో రేపు తాడిపత్రిలో నియోజకవర్గస్థాయి విస్తృ స్థాయి సమావేశం జరుపుతామని వైసీపీ ప్రకటించగా.. ఇదే సమయంలో తాడిపత్రి రూరల్ పరిధిలోని వీరాపురంలో టీడీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.. రెండు కార్యక్రమాలు ఒకేసారి కావడంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రి లో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసుల అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలంటూ వైసీపీ జిల్లా అధ్యక్షునికి నోటీసులు ఇచ్చారు.. అయితే, దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు.. యథావిథిగా రేపటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. వాయిదా వేసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది..