ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని తెలిసిందన్నారు. యువతకి ఉద్యోగాలు రావాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారన్నారు. సీఎం సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్. 2019-24లో ఆ బ్రాండ్‌ను నాశనం చేశారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేసేందుకు ముందుకి వస్తే వాటిని రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక రాష్ట్రం, ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అమరావతిలో క్వాంటం సెంటర్లు ఏర్పాటు, గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి, విశాఖలో ఐటీ హబ్స్, మెడికల్ రంగాలు.. ఇలా ప్రాంతాల వారిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం ముందుకి తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ఉన్నారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మనకు వస్తుంది. డేటా సెంటర్‌ని దేశంలో ఏర్పాటు చేయాలంటే సెక్యూరిటీతో ఉండే విధంగా విశాఖలో ఏర్పాటు చేయాలనీ అనుకున్నాము. విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేలా అనేక కార్పొరేట్ సంస్థలతో మాట్లాడటం జరిగింది’ అని తెలిపారు.
Also Read: Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
‘దావోస్ పర్యటనలో కూడా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకి రావాలని కోరాము. సింగపూర్ ప్రభుత్వంతో 1995 నుంచి సీఎం చంద్రబాబుకి అనుబంధం ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకి గౌరవం ఇస్తుంది. గతంలో సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే గత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ నష్ట పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు మంత్రులని కలవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, 26 కార్యక్రమాలలో పాల్గొనడం, ఫిల్డ్ విజిట్స్ చేయటం జరిగింది. అనేక సంస్థల ప్రతినిధులని కలవడం జరిగింది. యువతకి ఉద్యోగాలు రావాలని చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని చెడగొట్టే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు. చంద్రబాబుని చూసి ఇతర రాష్ట్రాల మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. మేము ఒక కమిట్‌మెంట్‌తో పని చేస్తుంటే వైసీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని దెబ్బ తీసేలా చేస్తోంది. సింగపూర్‌లో మంచి స్పందన వచ్చింది. స్పీడ్ ఆఫ్ బిజినెస్లో భాగంగా నేరుగా జీవోలు జారీ చేస్తున్నాము. విశాఖలో భారతి సిమెంట్స్, హెరిటేజ్ కి ఇవ్వలేదు. ఉద్యోగ ఉపాధి కలిపించేందుకు విశాఖలో ఐటీ హబ్స్ ఏర్పాటు కొరకు తక్కువ ధరకే భూములు కేటాయిస్తున్నాము. పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా అనేక విప్లవత్మక నిర్ణయాలు తీసుకుంటోంది’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.