Adireddy Vasu: మెడికల్ కాలేజీల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ అన్నట్లుగా రాజమండ్రి మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేమని.. రాజమండ్రిలో ఓహో అనిపించేలా వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం కట్టుకున్నారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని రూ. 5 వేల కోట్లు అప్పు చేసిందని, ఆ నిధులు ఎటు దారి మళ్లించాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని విమర్శించారు.
READ MORE: Jharkhand Encounter : హజారీబాగ్ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి
పీపీపీ మోడ్ లోనే అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. పీపీపీ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా మెరిట్ సీట్స్ 42 నుంచి 50 శాతానికి కూటమి ప్రభుత్వం పెంచిందని తెలిపారు. జగన్ ఉన్నప్పుడు 42 శాతం మెరిట్ సీట్లు 50 శాతానికి ఎందుకు పెంచలేదో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మాపై బురద చల్లేసి కడుక్కోమంటున్నారని అన్నారు. ఫ్యాక్షన్ తరహాలో మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో జగన్ ప్రజల మధ్య ఉండటం శ్రేయస్కరం కాదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్ జైలుకు వెళ్లిపోవడమే మంచిదన్నారు. జగన్ లాగే ఆయన శిష్యులు ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని, మాజీ ఎంపీ మార్గాని భరత్ రోజురోజుకీ దిగజారి పోతున్నారని విమర్శించారు.
READ MORE: Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక