Budda Venkanna : జగన్.. ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానే చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల్లయ్య హత్యను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు పల్నాడుకు బుద్దా వెంకన్న బయలు దేరడంతో.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బుద్దా వెంకన్నని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని, హత్యలు చేయమని సీఎం ప్రొత్సహిస్తున్నారన ఆయన ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని, పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను చంపేశారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అని మండిపడ్డా వెంకన్న.. పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జల్లయ్య మృతదేహానికి నివాళి అర్పించడానికి మేము వెళ్లకుడదా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారని, డీజీపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్నారన్నారు. మూడేళ్లు సవాంగ్‌ను వాడుకుని పంపేశారని, ప్రస్తుత డీజీపీ పరిస్థితి కూడా అంతే అనేది తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. జగన్.. ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానే చూస్తారని, రాజకీయంగా ఎదుర్కోలేక.. జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి బుద్ధి చెప్పాలన్నారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!