Andhra Pradesh CM Jagan Fired on TDP MLA’s at Assembly Meetings Today.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సహజ మరణాలకు కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో నాటుసారా తయారీ విచ్చలవిడిగా జరిగిందన్నారు. కానీ ఇప్పడు అక్కడక్కడ జరుగుతోందని, కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
బెల్డ్ షాపులను ఇప్పడు పూర్తిగా ఎత్తేశామని, లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందన్నారు. గతంలో గుడి, బడి ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన ఆరోపించారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయని, దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయని ఆయన అన్నారు. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదని.. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.