AP Assembly & Lok Sabha Exit Poll 2024, AP Elections 2024, AP Assembly Exit Poll 2024, Lok Sabha Exit Poll 2024, YSRCP, TDP-Janasena-BJP, Congress, INDIA
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి..
పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం అన్నారు పోతిన మహేష్.. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్న ఆయన.. పశ్చిమ నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందన్నారు.
మంత్రి అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని విమర్శలు గుప్పించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ( TDP- Janasena- BJP ) కలిసి పోటీ చేసి ఎంపీగా గెలిచినా అందరూ మోడీకే ఓట్లేస్తారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ఆరోపించారు.