Glass Symbol: సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.. జనసేన పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు ప్రధాన పార్టీలతో జనసేన ఎన్డీయేలో పొత్తులో ఉంది.. అందుకే మేం అన్ని చోట్లా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే పోటీకి దిగాం.. మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నాం.. ఈ సమయంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వటం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.. గుర్తింపు పొందిన 2 పార్టీలతో జనసేన పార్టీ పొత్తులో ఉంది.. మేం పొత్తులో లేకపోతే జనసేన పోటీ చేయని చోట సింబల్ వేరే వారికి ఇస్తే ఇబ్బంది లేదు.. కానీ, ఇప్పుడు జరుగుతోంది అంతా ఎన్నికల వ్యవహారంలో భాగమే అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ సైన్యం పాడు పని.. చిన్నారులపై లైగింక దోపిడీ
ఇక, జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కూడా ఈసీకి వినతి పత్రం ఇచ్చామని హైకోర్టుకు తెలిపింది జనసేన.. ఇప్పటి వరకు మాకు స్పందన లేదని.. రెండోసారి కూడా చీఫ్ ఎన్నికల అధికారికి ఇదే విషయంపై వినతి పత్రం ఇచ్చామన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నామని.. మిగతా సీట్లలో మా పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామన్నారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థికి కేటాయించటం వల్ల పొత్తులో మిగతా పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే విషయంలో ఓటర్లకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందన్నారు. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్ధి గాజు గ్లాసు గుర్తు ఉంటే, దాని పరిధిలో ఉన్న తునిలో స్వతంత్ర్య అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు.. ఇలా చేయటం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతారని తెలిపారు. అయితే, 24 గంటల్లో జనసేన పార్టీ అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.. దీంతో.. జనసేన పిటిషన్ పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.