మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది.. ఇక, ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు.. వీఐపీలు పెద్ద సంఖ్యలు తరలిరానున్న నేపథ్యంలో.. ప్రముఖుల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు..
అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్‌చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.
నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటున్నాను అన్నారు. నేను సరిగా పని చేయకుంటే.. ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి.. అందుకే జీతం తీసుకుంటున్నాను.. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను.. వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం అన్నారు పవన్..
జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోందన్నారు పవన్ కల్యాణ్
మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.