CM YS Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లలను పుట్టించి, కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గం కూడా వదిలిస్తున్నారు అంటూ హాట్ కామెంట్లు చేశారు. అందుకే దత్తపుత్రుడికి ఈమధ్య బీపీ ఎక్కువగా కనిపిస్తోందన్న ఆయన.. ఒక్కసారి చేస్తే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారని దత్త పుత్రుడికి చెప్పా.. పవిత్రమైన బంధాన్ని నడిరోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పు కాదా? అని దత్తపుత్రుని అడుగుతున్నాను అన్నారు. నువ్వు చేస్తున్నది తప్పు కదా? అని అడిగితే అది దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోయి ఊగిపోతున్నారు.. నేను అడిగే ప్రశ్నలకు చంద్రబాబుకి కోపం, దత్తపుత్రుడికి కోపం, చంద్రబాబు వదినకు కూడా కోపం అని ఎద్దేవా చేశారు.
Read Also: CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే..
చేసిన మంచి మాత్రం చెప్పడానికి చేసిన మంచి చెప్పడానికి ఏ ఉదాహరణ కనిపించదు.. చంద్రబాబు చేసిన మోసాలు చూపడానికి చాలా కనిపిస్తాయన్నారు సీఎం జగన్.. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి ఆయన చేసిన మంచి కనిపించదు.. చంద్రబాబు తన జీవితమంతా మోసాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉంటారు.. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే .. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కాంగ్రెస్ కోవర్టులు వ్యవస్థలో ఉన్న వీరి మనుషులు కలసి ఒక్క జగన్ పై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక్కడు . బాబుకు 10 మంది సేనానులు.. చంద్రబాబు వెనుక పదిమంది సేనానులు బాణాలు ఎక్కువ పెట్టి ఉన్నారు.. వారు వేసే బాణాలు తగిలిబోయేది జగన్ కా .. లేక జగన్ అమలు చేసే పథకాలకా అనేది ప్రజల ఆలోచించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.