మంత్రి అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.. బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా చారిత్రాత్మకమైన సభలా జరిగింది అని పేర్కొన్నారు. బొప్పూడి సభకు 12 కిలో మీటర్ల దూరంలో నేనే ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. సభకు ఎటూ సూచినా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది.. సభలో ఒక భాగం ప్రజలుంటే.. మూడు భాగాలు సభ బయట ట్రాఫిక్‍లోనే ఉన్నారు.. ట్రాఫిక్‍ను క్లియర్ చేయడంలో, జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది.. పోలీస్ వ్యవస్థ కావాలనే ట్రాఫిక్ సమస్యను సృష్టించారు అని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
Read Also: Haryana Cabinet: సైనీ కేబినెట్ విస్తరణ.. ఎంత మందికి చోటు దక్కిందంటే!
ప్రజాగళం సభ భద్రత వైఫల్యంపై విచారణ చేపట్టాలని సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లక్షలాది మంది జనం వేదిక వైపు తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నట్లు నిల్చున్నట్లు ఉండిపోయారని ఆరోపించారు. టీడీపీ- జనసేన- బీజేపీ సభ విజయవంతాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కొందరు సభను అడ్డుకోవాలని ప్రయత్నించారు అని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.