Pawan Kalyan: మీకు కత్తి ఇస్తాను తప్ప చేస్తే నా తల నరకండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో పోలవరం ప్రాజక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ విజయభేరి ప్రజాగళంలో భాగంగా వారాహి యాత్ర తూర్పుగోదారి జిల్లా కోరుకొండలో నిర్వహంచారు. దీనిలో నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను కులాలకు అతీతమైన వ్యక్తి అని పదే పదే చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో కాపు కార్పొరేషన్లకు రెండు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని, కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టి ఆర్ధికంగా వెనబడిన వారికి ఇచ్చే ఈబీసీ ఇస్తామని చెప్పిన వైసీపీ.. ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈబీసీ రిజర్వేషన్ తీసేశారన్నారు. ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేసారు చెప్పాలన్నారు.
Read Also: SunRisers Hyderabad: టీ-20 చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డులు సాధించిన సన్‌రైజర్స్..
ఇక, నన్ను తిట్టడానికి మాత్రమే కాపు ఎమ్మెల్యేలు, నాయకులను సీఎం వైఎస్ జగన్ ఉపయోగించుకున్నారు అని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్.. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక, దోపిడి, బ్లేడ్ బ్యాచ్ కు రాజధానిగా ఉందని ఆరోపించారు. ఎన్టీయ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అడ్డుకట్ట వేసి వైసీపీ గూండాల తాట తీస్తామని హెచ్చరించారు. ఎన్డీఏ కూటిమి అధికారంలోకి వస్తే చర్చిలు మూతపడతాయని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు అన్ని కులాలు సమానం అని చెప్పడానికి క్రిస్టియన్ సినిమా జానీ తీయడం జరిగింన్నారు. అన్ని కులాలు, మతాలను ప్రేమిస్తాన్నారు. కోరుకొండ మండలంలో 600 వందల ఎకరాలు ,రూ. 15 లక్షలకు రైతుల దగ్గర తీసుకుని రూ. 45 లక్షలు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేసారని.. దీనిలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలోను సుమారు రూ.300 కోట్లు వైసీపీ నాయకులు సంపాదించాదరన్నారు. ఈ నియోజకవర్గంలో నేషనల్ ట్రిబ్యునల్ మూడున్నర కోట్లు ఫెనాల్టీ విధించినా.. దోపిడి ఆగలేదన్నారు. పోలీస్ శాఖలో కొందరు ఉద్యోగులు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెడితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోరుకొండ పరిధిలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.