Pothina Mahesh: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో చిచ్చు పెడుతుంది.. కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు పార్టీలకు చెందిన బలమైన నేతలు ఉండడం కూడా దీనికి కారణం అవుతుంది.. దీంతో.. అంతా నాకంటే.. నాకే అంటూ సీటు కోసం పట్టుపడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించాలంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిస.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kangana Ranaut : కంగనాకు ఎంపీ టికెట్.. వైరల్ అవుతున్న మూడేళ్ల కిందటి ట్వీట్
పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం అన్నారు పోతిన మహేష్.. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్న ఆయన.. పశ్చిమ నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు అన్నారు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడలేరన్నారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గానికి పంపించిది మా పోరాటవళ్లే కదా? అని ప్రశ్నించారు. ఇక, నాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నమ్మకం ఉందన్నారు.. పవన్ కల్యాణ్ 2వ లిస్ట్ లో నా పేరు ఉంటుంది అని చెప్పారు.. ఆయన చెప్పడం వల్లే నా దూకుడు పెంచాను.. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరూ కోరుకుంటున్నారు.. నాకు సీటు ఇవ్వడమే నాయ్యం అన్నారు పోతిన మహేష్..