ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…
తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం తెలుగుదేశం పార్టీ అనేవారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ వత్తిడిలో వుంది. 40 ఏళ్ళ పండుగను గర్వంగా జరుపుకుంటున్నామని చెబుతున్నా. భవిష్యత్ సవాళ్ళు టీడీపీ నేతల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండురోజుల మహానాడు జరుగుతోంది. రాబోయే కాలం అంతా టీడీపీ నేతలకు పరీక్షా కాలమే అని చెప్పాలి. టీడీపీలో సంస్ధాగతంగా…
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…
టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు. 40 ఏళ్ల…
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం…
టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను…
తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు…