ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని జరుపుకుంటున్నాం.
ఈ భూమి మీద ఎంతోమంది పుడతారు. ఆయన శత పురుషుడు. తెలుగు ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా బెదరక, చెదరక, తలవంచక ముందుకు సాగారు. అత్యున్నత శిఖరాలకు చేరాలంటే కష్టపడాలి. నీ దారిలో నీవు నడవాలని నాన్నగారు నాకు నేర్పారు. తెలుగు వెలుగు నందమూరి తారకరామారావు. అన్నీ అనుకూలించి మహత్తర ముహూర్తంలా పార్టీని స్థాపించారు. సినీజగత్తులో కోట్లాదిమంది అభిమానం చాటుకున్నారు. ఆయన పటాన్ని పూజాగదిలో పెట్టుకున్నారు. ఆయన రూపాన్ని గుండె గదిలో పెట్టుకున్నారు.
ఈ మూడేళ్లల్లో ధరలు పెరిగాయి.. అన్ని రకాల ఛార్జీల రేట్లు పెంచేశారు.దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టొయ్ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుది.మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు చంద్రబాబు.ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు.టీడీపీని అధికారంలోకి తెస్తేనే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుంది.
టీడీపీకి ప్రజాశీస్సులు ఇవ్వాలి.తెలుగు వారు కాని వారు కూడా తెలుగోళ్లను గుర్తు పట్టేలా చేసిన ఘనత ఎన్టీఆరుదే.ఓటంటే నోటు కాదు. గుడినే కాదు గుళ్లో లింగాన్ని కూడా మింగేసేవాళ్లున్నారు. నువ్వు-నేను కలిస్తే మనం.. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం.ఇప్పుడు మహానాడు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది.శత పురుషుడి శత జయంతి జరుపుకుంటున్నాం.పేదొడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని తపించేవారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయన్నారు బాలయ్య.