PeddiReddy Ramachandrareddy: ఈసారి ఎన్నికల్లో మరిన్ని సీట్లు గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు.
2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలన ప్రజల దృష్టిలో సంక్షేమ పాలన. చంద్రబాబు, టీడీపీకి మాత్రమే ఇది సైకో పాలన లా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పాటు సైకో పాలన సాగింది. డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టిడిపిదే, వైసిపి లో అలాంటి సంస్కృతి లేదు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
జగన్ సీఎం అయ్యాక ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందన్నారు. ప్రతి పిల్ల వాడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా, ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు నేడు తో ఆధునీకరిస్తున్నాం. కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వ తాతల వరకు అందరికీ ఆర్థిక అండ లభిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధ్యయనాలు చేస్తున్నాయి. 14 ఏళ్లలో మీరు ఇంత గొప్ప గా ఏం చేశారో చెప్పగలరాఝ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి. లాంఛనంగా ఉగాది రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు. గతంలో జిల్లాలు సుదీర్ఘ ప్రాంతాలు ఉండటంతో పాలన లో ఇబ్బందులు ఉండేవి. ఉదాహరణ కు మదనపల్లె భారత దేశం లోనే పెద్ద డివిజన్. ఇప్పుడు జిల్లాల విభజన వలన అధికారులకు పట్టు ఉంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!