తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్‌కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా..…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీలో గ్రిప్ వచ్చేవరకు ఓపిక పట్టి.. అందరినీ మార్చేయాలని అనుకున్నారట. అయితే.. ఒకదాని వెనక మరో కార్యక్రమం రావడంతో ఆ ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడున్న డీసీసీలో దాదాపు 13 మందిని మార్చాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. జిల్లాల్లో చురుకుగా పనిచేయని వారిని మార్చేయాలని కొంత కసరత్తు చేసినట్టు టాక్. ఇంతలో పార్టీ జాతీయ…
తెలంగాణ కాంగ్రెస్ మరో కొత్త సంప్రదాయానికి తెర తీయాలని చూస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం మొదలుకొని…ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కూడా టికెట్ల కేటాయింపుపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఖరి వరకు కాకుండా…అరు నెల్ల ముందే అభ్యర్థుల ప్రకటన ఉండాలని చర్చకు పెట్టారు నేతలు. మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశం లో కూడా సీనియర్ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఐతే టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్‌లో. రాహుల్ గాంధీ…
ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్‌నగర్‌ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్‌లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో టచ్ మీ నాట్‌గా కనిపించినట్టు పార్టీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట. వాస్తవానికి కాంగ్రెస్‌లో రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తర్వాతే ఎవరైనా. కానీ రాహుల్ గాంధీ టూర్ మొదటిరోజు.. ఠాగూర్ కాస్త దూరం అన్నట్టుగా ఉన్నారని టాక్. సాధారణంగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తే.. రిసీవ్ చేసుకునే వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ముందు ఉంటారు. కానీ రాహుల్…
తెలంగాణలో రెండు రోజులపాటు సాగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై.. అధిష్ఠానానికి నివేదిక ఇచ్చే పనిలో పడ్డారు రాజకీయ వ్యూహకర్త సునీల్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీ క్రమశిక్షణ గురించి చెబుతూనే.. టీఆర్ఎస్, బీజేపీతో దోస్తీ చేసే నాయకులు తమకు అవసరం లేదు.. వెళ్లిపోవాలనే కామెంట్స్ పార్టీ కేడర్‌కు బూస్ట్ ఇచ్చాయని గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే… కొందరు సీనియర్లు మాత్రం రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్నారట.…
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్‌ది ప్రతిపక్ష పాత్ర. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలోనూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండిచ్చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకొనే పనిలో ఉంది. అయితే రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలకు నేతలు కరువైయ్యారు. అనేక ఆటుపోట్ల మధ్య…
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని…
తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువే..! కానీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సామాజిక ఈక్వేషన్ దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గమనించకుండా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలు ఉంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ అని చెబుతున్న కాంగ్రెస్‌లోనే ఆ సమీకరణాల లెక్క తప్పడంతో కొత్త చర్చ మొదలైంది. పార్టీ నేతల నుంచే పెదవి విరుపు వస్తోందట. నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో…