తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. కోశాధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. వీళ్లంతా నిజామాబాద్ జిల్లా నాయకులే. మహేష్‌గౌడ్ పూర్తిస్థాయిలో పార్టీ పనిలో ఉంటే..…
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్‌ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్…
తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్‌లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్‌ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్. మహిళా…
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్‌తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా.…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం ఉందని లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా వేడి రగిలించాయి. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చకు భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నాయట. సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం లేకపోలేదన్న భూపాల్‌రెడ్డి.. గులాబీ బాస్ నల్లగొండను ఎంపిక చేసుకుంటే చరిత్రలో నిలిచిపోయే…