ఘట్‌కేసర్‌లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు…
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరే డిఫరెంట్. ఎవరు ఏం చెప్పారు అనే దానికంటే.. మాకు నచ్చింది మేము చేస్తాం అనే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. వరంగల్ వేదికగా..రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. వచ్చే నెల రోజుల్లో క్షేత్ర స్థాయికి డిక్లరేషన్ తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. ఆ వెంటనే ప్రకటనలు చేసేసి.. సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ ప్రకటించారు పార్టీ నేతలు. ఆ షెడ్యూల్ ప్రారంభించి వారం అయ్యిందో, లేదో… నాయకులు అంతా గాయబ్ అయ్యారు. కింది…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.…
కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్‌గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్‌ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్‌ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో వలసల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఆయన భార్య కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ.. ఎప్పటి నుంచో వస్తారు.. వస్తారు అని ప్రచారం జరిగిన ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం కొలిక్కి రావడం లేదు. ఆయన వస్తున్నారా? ఆగిపోయారా? అనేది ఎటూ తేలలేదు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా… సోనియాగాంధీని కలిసి పార్టీలోకి వస్తా అని చెప్పారు DS. ఆయన విన్నపానికి మేడం క్లియరెన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అప్పట్లో పీసీసీ…
తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్ ఎస్ యు ఐ నాయకుడి వివాహానికి హాజరైన ఇద్దరు నేతలు, ఆ పెళ్లి వేడుకను తమ రాజకీయ, వర్గ విభేదాలకు వేదికగా మార్చుకోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితమే వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం కావడం, కలసి పని చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్…
తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్ సంకేతాలు…
రాజస్థాన్ ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఐదుళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టడం.. అదే పదవిలో కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేయడం.. కొత్త పదవులు ఇస్తారో లేదో స్పష్టత లేకపోవడం.. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ, మాజీ ఎంపీ మధుయాష్కీకొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న.…