TCongress : ఆ పెద్దాయనకు బాధ్యతలు అప్పగిస్తే హ్యాండ్ ఇచ్చాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్ సంకేతాలు ఇస్తాయని లెక్కలేసుకున్నారు నాయకులు. అయితే ఓదెలు కుటుంబం చేరిక కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చకు దారితీస్తోందట. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన భార్య సురేఖ అక్కడ కాంగ్రెస్‌లో కీలకం. అలాంటిది ఓదేలు చేరిక తమకు తెలియలేదని ప్రేమ్‌సాగర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాట మాత్రమైనా చెప్పలేదని నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.
ఓదేలు చేరికపై బ్యాక్‌గ్రౌండ్ వర్కు అంతా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చేశారట. ఇక్కడో మతలబు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరాలి అనే దానిపై పంచాయితీలు లేకుండా సీనియర్ నాయకుడు జానారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది హైకమాండ్. ఆ కమిటీలో జానారెడ్డితోపాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. జిల్లాల వారీగా చేరికలపై పరిశీలన.. అక్కడి నాయకులతో సమన్వయం చేసి పార్టీలో చేర్చుకోవాలనేది ఆ కమిటీ ఉద్దేశం. ఓదేలు విషయంలో అదేమీ జరగలేదట. అయితే TRS నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వారి గురించి కమిటీ ముందు పెట్టి చర్చిస్తే.. ఈ లోపు రాజకీయంగా ఒత్తిళ్లు పెరిగి చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉందనేది కొందరి వాదన.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ప్రతీ చేరిక వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుంది. కమిటీలో చర్చించిన తర్వాతే కండువా కప్పాలని అనుకుంటే ఇక అంతే సంగతులని మరికొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాలు పైస్థాయిలోని కాంగ్రెస్ నాయకులకు తెలియంది కాదు. కాకపోతే.. అన్నీ తెలిసి చేరికల కమిటీ వేసి.. అక్కడ ముందుగా చర్చించాలి అనే నిబంధన పెట్టడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓదేలు విషయంలో ప్రేమ్‌సాగర్‌రావుకు సమాచారం లేదు సరే.. చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డికైనా తెలుసా అనేది ప్రస్తుతం చర్చ. పెద్దాయనకు కూడా తెలియకపోతే.. చేరికల కోసం కాంగ్రెస్ వేసిన కమిటీని నామ్ కే వాస్తేగా మిగిలిపోతుందా? ఇకపైనా చేరికలు వారికి తెలిసే అవకాశం లేదా? గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్నలివి.
ప్రియాంకగాంధీ సమక్షంలో ఓదేలు కుటుంబం కాంగ్రెస్‌లో చేరడంతో.. ఈ అంశంపై పార్టీలో ఎవరూ ఓపెన్‌గా కామెంట్ చేయడం లేదు. కాకపోతే సమాచారం లేదన్న అంశంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు అసంతృప్తితో ఉన్నారట. మరి.. ఈ అసంతృప్తులు భగ్గుమని రోడ్డెక్కకుండా కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క