పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని..
అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్‌స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు..
ఆ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్.... మనమంతా లక్కీ భాస్కర్స్ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా..
నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్‌లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. సంతలో ఓ చిన్న బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.. అదికాస్తా వైరల్‌గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారులు... పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు.. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…
నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు.. దత్త పుత్రుడు అంటారు.. నేను భరించా.. కానీ, ఆయన్ని జగ్గు భాయ్ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ గారు నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా.. తర్వాత జగ్గు అంటా.. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు.. మీరు నోరు ఎంత జారితే నేను అంత జారుతానని ప్రకటించారు
Bike Buy With 10 Rupee Coins:10 రూపాయల నాణేలు చెల్లడంలేదని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ దెబ్బతో బయట ఎక్కడా 10 రూపాయల కైన్ ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు.. ఇచ్చేవారు ఉన్నా పుచ్చుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.. అంతలా 10 రూపాయల నాణెంపై ఓ ముద్ర పడిపోయింది.. అలాంటి ఏమీలేదో మొర్రో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చినా.. కిందిస్థాయిలో మాత్రం.. 10 కైన్‌పై చిన్నచూపే ఉంది.. చివరకు బిక్షాటన…
Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.…
ఏపీలో సంచలనం కలిగించిన తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ స్కాం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే నాకు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు…