CM Chandrababu Tanuku Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్‌స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు.. మరోవైపు.. నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల మంది ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు… ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో భేటీకానున్న సీఎం.. కీలక సూచనలు చేయనున్నారు.. జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు..
Read Also: WPL 2025 Final: నేడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్
ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటన కోసం.. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లిలో తన ఇంటి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి.. ఉదయం 8 గంటలకు తణుకు ఎస్ఎం వీఎం పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఉదయం 8.10 నుంచి 8. 20 వరకు జిల్లాలోని నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. 8.21 నుంచి 8.30 వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో సమావేశం అవుతారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 8.35కి పట్టణంలోని ఎన్టీఆర్ పార్కుకు చేరుకుని, 9 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. 9.05కి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుని 10.05 గంటల వరకు ప్రజావేదిక నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10. 10కి జూబ్లీ రోడ్లోని నూలివారి లేఅవుట్ కి చేరుకుని, 11 గంటల వరకు పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో, 11 నుంచి 12 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశమ వుతారు. ఇక, 12.05కి పాలిటెక్నిక్ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10కి హెలికాఫ్టర్‌లో జిల్లా నుండి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.