ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు. తాజాగా తమిళనాడులోని మధురైలో ఉచిత మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా మనోళ్లు వదలరు. అలాంటిది క్వాటర్ బాటిల్స్ దొరికితే, బీరు బాటిల్స్ బాక్సులు కనపడితే వదులుతారా..? Kerala: కేరళలో కొత్త…
కేరళలో కొత్త రకం వైరస్ అక్కడి ప్రజలను కంగారెత్తి్స్తోంది. కేరళలోని పలు జిల్లాల్లో ఇటీవల టమాటో ఫ్లూ అనే వైరస్ వెలుగుచూసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా చిన్నారులు డీ హైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా, చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చర్మంపై టమాటో ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొల్లం ప్రాంతంలో…
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. ఆయన దాతృత్వ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సాయం కోరిన వారికి, తమ ప్రతిభతో ఆకట్టుకునేవారి పట్ల ఆయనెంతో ఉదారంగా వ్యవహరిస్తుంటారు. తనవంతు సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న కమలాత్తాళ్ కు ఆయన…
తమిళనాడులో సీఎం స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 7న డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారక చిహ్నం అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. డీఎంకే పాలన ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ స్వయంగా…
దేశంలో హిందీ భాషా వివాదం నడుస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన హిందీ భాషా వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీ భాష అనేది మంచి లాంగ్వేజ్ అని.. అది కూడా నేర్చుకోవాలని.. అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లు…
తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ మరికొద్దిరోజుల్లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లోకి రాబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు డీఎంకే నేతలు ఈ వార్తలు నిజమే అని ధృవీకరిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ప్రజాదరణ పొందారని.. చాలామంది మంత్రులు తమ కార్యక్రమాల్లో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని…
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో రథోత్సవం సందర్భంగా కరెంట్ షాక్ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. తంజావూరు సమీపంలోని కలిమేడు గ్రామంలో ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసుస్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల…
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు…
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో…
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…