Tamil Nadu: తమిళనాడులో మరోసారి ‘‘హిందీ’’ వివాదం రాజుకుంది. హిందీయేరత రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను పునరాలోచించుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోడీకి లేఖ రాశారు. అక్టోబర్ 18, 2024న హిందీ మాస వేడుకల ముగింపు సందర్భంగా చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ లేఖ రాశారు.
హిందీ ప్రాథమిక భాష కానీ రాష్ట్రాల్లో హిందీని ప్రోత్సహించడంపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని, హిందీ-ఇంగ్లీష్ కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. “భారతదేశం వంటి బహుభాషా దేశంలో, హిందీకి ప్రత్యేక హోదా ప్రకారం మరియు హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ మాసాన్ని జరుపుకోవడం ఇతర భాషలను కించపరిచే ప్రయత్నంగా పరిగణించబడుతుంది” అని చెప్పారు.
Read Also: Asaduddin Owaisi : ఎన్‌కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్‌కు పంపండి.. సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
హిందీ ఎక్కువగా మాట్లాడని రాష్ట్రాల్లో ఇలాంటి హిందీ ఆధారిత వేడుకలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. ఈ కార్యక్రమాలను కొనసాగించాలని ప్రభుత్వం పట్టుబడినట్లైతే, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషలకు కూడా అంతే ఘనంగా జరుపుకోవాలని ఆయన అన్నారు.
దేశంలో గుర్తింపు పొంది అన్ని సాంప్రదాయ భాషల గొప్పతనాన్ని ఉత్సవాలుగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ భాషా వర్గాల మధ్య సత్సంబంధాలను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించగలవని ఆయన లేఖలో పేర్కొన్నారు.