తమిళనాడు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే అధికార డీఎంకే, తమిళ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. డీఎంకే ప్రవేశ పెట్టిన ఈ బిల్లులో తమిళనాడు రాష్ట్రంలో హిందీని నిషేధించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనీ ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. ఈ బిల్లులో ప్రధాణంగా తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు,…
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగించింది. ఈ బంగారం 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదంతా నిరుపయోగంగా ఉందని..ఈ వెయ్యి కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్వర్ణాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ.17.81 కోట్లు వడ్డీ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తమిళనాడులో ప్రస్తుతం భాషా వివాదం నడుస్తోంది. అధికార పార్టీ డీఎంకే హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ద్విభాషకే మద్దతు తెలిపింది. త్రిభాషా విధానాన్ని తప్పుపడుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
దేశంలో టమాటా ధరల పెరుగుదలలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల వంట గదికి టమాటా దూరం అయింది. దేశంలోని పలు నగరాల్లో టమాట కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరోనా విజృంభణతో కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, కర్ణాటకలోనూ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం.. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో పడిపోయారు.. రేపటి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. తగ్గినట్టే తగ్గిన కోవిడ్ మళ్లీ పంజా విసురుతుండగా.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు బాటపడుతున్నాయి.. కోవిడ్ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన మార్క్ చూపిస్తున్నారు స్టాలిన్.. కొన్ని సందర్భాల్లో అందరినీ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యంలో ముంచేసిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్… రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారికి సహాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.. కరోనాబారినపడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాగా, ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో…