తమిళనాడులో ప్రస్తుతం భాషా వివాదం నడుస్తోంది. అధికార పార్టీ డీఎంకే హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ద్విభాషకే మద్దతు తెలిపింది. త్రిభాషా విధానాన్ని తప్పుపడుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
ఇది కూడా చదవండి: Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!
భాషా వివాదం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో డీఎంకే కీలక మార్పులు చేసింది. రూపీ సింబల్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చింది. రూపీ సింబల్ స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరం రూపొందించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యా విధానంలో ద్విభాషను మాత్రమే అమలు చేస్తామని డీఎంకే సర్కార్ తెలిపింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. మరోవైపు ఢిల్లీ వేదికగా కూడా ఫైటింగ్ చేస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో డీఎంకే ఎంపీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. బలవంతంగా తమపై హిందీ రుద్దు తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీని అనుమతించబోమని డీఎంకే స్పష్టం చేసింది.
