Tamilnadu : తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే వైతిలింగం, మరికొందరికి చెందిన రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆర్ వైతిలింగం మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా. అతని ఆస్తిని జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఇచ్చింది. రెండు స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో ఒకటి రుచిరాపల్లిలో రిజిస్టర్ చేయబడి ఉండగా, మరొకటి ముత్తమ్మల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిజిస్టర్ చేయబడింది.
Read Also:Australian Open 2025: దూసుకెళ్తున్న అల్కరాస్.. యుకి, బోపన్న జోడీలు ఔట్!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం సన్నిహితుడు వైతిలింగం, తమిళనాడు అసెంబ్లీలో ఒరటనాడు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022లో ఓపీఎస్, ప్రస్తుత పార్టీ చీఫ్ ఈకే పళనిస్వామి మధ్య చాలా వివాదం జరిగింది. ఆయనను ఓపీఎస్ తో పాటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆయన గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిగా కూడా పనిచేశారు.
Read Also:Hindenburg Shutdown: మూతపడనున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్..
లంచం తీసుకున్నట్లు ఆరోపణలు
తమిళనాడు విజిలెన్స్,. అవినీతి నిరోధక డైరెక్టరేట్ (DVAC) దాఖలు చేసిన FIR ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఆర్ వైతిలింగం తన పదవీకాలంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో లంచాలు తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి శ్రీరామ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రూ.27.90 కోట్లు లంచం తీసుకున్నారు.