Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని తగిన ఉపశమనం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
తిరునల్వేలి జిల్లాలోని మెయిన్ రోడ్డులోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ ద్వారం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. అయితే సుప్రీం కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు అనుమతిని నిరాకరించిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఇటువంటి విగ్రహాల ఏర్పాటు కారణంగా తరచుగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడతాయని.. ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని గతంలో హైకోర్టు పేర్కొంది. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల హక్కులను కాపాడాలి. సుప్రీంకోర్టు అటువంటి అనుమతులను నిషేధించినప్పుడు రాష్ట్రం వాటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకూడదు.’’ అని న్యాయస్థానం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!
తమిళనాడు రాజకీయాలపై కరుణానిధి చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపారు. ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2018, ఆగస్టు 7న ఆయన మరణించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్‌సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించారు. ప్రస్తుతం తమిళనాడులో కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2026 ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!