వరల్డ్ వైడ్ గా చెస్ కు మంచి ఆదరణ ఉంది. చెస్ ఆడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఇకపై చెస్ ఆడలేరు. అక్కడి తాలిబన్ ప్రభుత్వం చెస్ పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చెస్‌ను నిలిపివేసింది. దీనికి గల కారణం ఏంటంటే.. చెస్ జూదాన్ని ప్రోత్సహించవచ్చని తాలిబన్లు అంటున్నారు. ఇది దేశ ఇస్లామిక్ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఆదివారం చెస్ సస్పెన్షన్‌ను క్రీడా అధికారి ఒకరు ధృవీకరించారు. చదరంగం నిషేధించడానికి అతిపెద్ద…
Pakiatan: దాయాది పాకిస్తాన్‌ని ఓ వైపు బలూచిస్తాన్ లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) దెబ్బ కొడుతున్న పట్టడం లేదు. భారత్‌ని కవ్విస్తూ యుద్ధోన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఇప్పటికే, బీఎల్ఏ పాక్ సైనికుల్ని ఊచకోత కోస్తున్నారు. బలూచిస్తాన్‌లో ఉరికించి కొడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాక్ తాలిబాన్లు 30 మంది పాక్ సైనికులను చంపినట్లు శుక్రవారం రాత్రి పేర్కొంది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. పలు దేశాధినేతలు మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భారత్‌కి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Taliban: బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము.
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.
Taliban: ఇఅఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.
Pakistan Air Strikes: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో 46 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.